ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్‌

SMTV Desk 2018-02-17 13:19:59  kohli, indian cricket captain, rasheed khan tweet, afghanistan

ఆఫ్ఘనిస్థాన్, ఫిబ్రవరి 17 : ప్రస్తుత క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. ఎంతలా అంటే స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా తన హవాను కొనసాగిస్తూ టీమిండియా కు ఒంటిచేత్తో విజయాలను అందిస్తున్నాడు. పరుగుల యంత్రంగా మారిన విరాట్ ప్రపంచ రికార్డులన్నిటిని అధిగమిస్తూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా మ‌రే ఇత‌ర బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రీతిలో ఛేజింగ్‌లో ఒత్తిడిని జయించి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ప్రస్తుత క్రికెట్ తరంలో కోహ్లికే సాధ్యం. తాజాగా ద‌క్షిణాఫ్రిక ప‌ర్య‌ట‌న‌లో కోహ్లీ రికార్డుస్థాయిలో ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ ప్రదర్శనపై అఫ్గాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. `ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్‌. అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌` అని ర‌షీద్ ట్వీట్ చేశాడు.