కాషాయిదళంకి భారీ షాక్..

SMTV Desk 2018-02-08 15:02:03  meghalaya, elections, bjp, West Shillong

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : మేఘాలయలో ఈ నెల 27న జరగనున్న ఎన్నికల సమరం ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. వెస్ట్ షిల్లాంగ్ నియోజకవర్గ బీజేపీ శాఖ నేతలంతా ఒక్కసారిగా రాజీనామా చేశారు. ఇందుకు కారణం శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ షిల్లాంగ్ బరిలో పార్టీ అభ్యర్థిని నిలబెట్టరాదని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. రాష్ట్రంలోగల మొత్తం 60 నియోజకవర్గాలు ఉండగా వీటిలో జనరల్ సీట్లు అయిదు మాత్రమే ఉన్నాయి. అందులో వెస్ట్ షిల్లాంగ్ కూడా ఉంది. అయితే ఇక్కడి నుండి పోటీ చేయించరాదని కషాయిదళం నిశ్చయించుకుంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి హవేర్‌గెయిల్ ఎడ్వినా బరేహ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీతో బీజేపీకి ప్రస్తుతం పొత్తు లేదు. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.