కేవీపీపై వేటు వేసిన రాజ్యసభ..

SMTV Desk 2018-02-07 12:59:14  CONGRESS LEADER KVP RAMACHANDRA RAO, SUSPENDED, RAJYASABHA, AP SPECIAL STATUS ISSUE.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిరసనను వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కేవీపీ ని సభ నుండి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.