ఇంటికి కూడా తప్పని జీఎస్టీ !!

SMTV Desk 2017-06-24 14:33:39  Developers, gst, Input tags credit, house pay

హైదరాబాద్, జూన్ 24 : దేశంలో వస్తు సేవా పన్ను జూలై 1 నుంచి అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జీఎస్టీ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతుందన్న సందేహం సామాన్యుల్లో నెలకొంది. కొందరు డెవలపర్లు జీఎస్టీ పెరగనుండటంతో ఇంటికి సంబంధించి మొత్తం సొమ్ము కట్టమంటూ సామాన్యుల పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై సేవాపన్ను దాదాపు నాలుగున్నర శాతం ఉంది. వచ్చే నెల 1 నుంచి 12% అవ్వటంతో, సామాన్యులపై ఈ భారం వేయడం సరికాదని కేంద్ర మంత్రులు తీవ్రంగానే హెచ్చరించారు. అయిన డెవలపర్లకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభిస్తుంది కాబట్టి, ఇళ్ల ధరలు పెరగడానికి అవకాశమే లేదని నిపుణులు వెల్లడించారు. ఎవరైనా డెవలపర్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన తరువాత ఆ ఫలితాన్ని కొనుగోలుదారులకు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి సామాన్యులకు అనుగుణంగానే జీఎస్టీ నిర్మాణ సంస్థలు వ్యవహరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపారు.