తల్లి ప్రేమకు నిదర్శనమే ఈ ఘటన..

SMTV Desk 2018-01-30 12:31:34  mother love, haveri, Karnataka, cow incident.

హవేరి, జనవరి 30 : తల్లి ప్రేమ అనేది కేవలం మనుషులకేనా.? కానే కాదు. తల్లి ప్రేమకు ఏది సాటి రాదు. అలాంటి మాతృమూర్తి.. తను కన్న బిడ్డకు ఏదైనా ఆపద వస్తే కోలుకునే వరకు నిద్రపోదు. అలాంటి ఘటనకు నిదర్శనమే ఈ ఉత్తర కర్నాటకలోని హవేరిలోని ఘటన. రెండున్నరల నెలలు ఉన్న ఓ దూడకు టెటానస్ వ్యాధి సోకింది. దీంతో ఆ దూడను దాని యజమాని వెటర్నరీ హాస్పటల్‌కు ఒక ట్రక్కులోకి తీసుకెళ్తున్నాడు. అలా ఆ దూడను తీసుకువెళ్తుంటే.. దాని వెంట తల్లి ఆవు కూడా పరుగులు తీసింది. అలా దాదాపు అరకిలోమీటర్‌ మేర ఆ ఆవు ట్రాలీ వెనుక పరిగెత్తింది. ప్రస్తుతం ఆ దూడకు చికిత్స చేయడంతో గాయం నయమై కాస్త కోలుకుందట. తల్లి ప్రేమకు చలించిన ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియోలో బంధించాడు.