కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభుతో మంత్రి కేటీఆర్ భేటీ..!

SMTV Desk 2018-01-10 17:17:05  IT Minister KTR, Central minister suresh prabhu, pharmacity, Nimitz status.

న్యూఢిల్లీ, జనవరి 10 : తెలంగాణ రాష్ట్రానికి మెగా లెదర్ పార్కు కేటాయించాలని కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభును కోరినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఢిల్లీలో సురేశ్‌ప్రభుతో భేటీ అయిన అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వడంతో పాటు అభివృద్దికి రూ. 1500 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ లో ఫిబ్రవరి 22, 23 వ తేదీలలో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా పారిశ్రామిక కారిడార్ అంశంపై చర్చి౦చి హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు సైతం నిధులు కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.