ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా గ్యాస్‌ బుకింగ్‌: ఐఓసీఎల్

SMTV Desk 2018-01-09 16:39:23  gas booking, facebook, twitter, iocl

న్యూ డిల్లీ, జనవరి 09: ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ విధానంలో సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటాము. దీనితో పాటు డిజిటలైజేషన్‌ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కల్పించింది. ఫేస్‌‘బుక్‌’లో ఇలా.. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సిలిండర్ బుక్ అవుతుంది. ట్విటర్‌లో ఇలా.. ట్విటర్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్ చేయాలనుకుంటే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్‌ ద్వారా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి.