భారత్ ను బోల్తా కొట్టించిన ఫిలాండర్..

SMTV Desk 2018-01-09 10:31:44  india, south africa won, 1st test, cap town

కేప్ టౌన్, జనవరి 9 : టీమిండియా జట్టు పేస్ చతుష్టయం, షమీ, భువనేశ్వర్, పాండ్య, బుమ్రా బాగానే రాణించారు. ఎన్నో ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై విజయం సాధిస్తామని ప్రతి ఒక్క భారత్ అభిమాని మదిలో ఆశ చిగురించింది. కానీ దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్, టీమిండియా బ్యాట్స్ మెన్ లను తన పేస్ తో బోల్తా కొట్టించాడు. మూడో రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో నాలుగవ రోజు 65/2 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టు, భారత్ బౌలర్లు చక్కగా రాణించడంతో మరో 65 పరుగులు జోడించి 130 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు బ్యాటింగ్ లైన్ ప్ ఫిలాండర్ ధాటికి పేక మేడల 135 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను 72 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ముందజలో ఉంది. భారత్ జట్టులో రవి చంద్రన్ అశ్విన్(37), కెప్టెన్ కోహ్లి (28), టాప్ స్కోరర్ గా నిలిచారు. ఆరు వికెట్లు తీసి ప్రోటీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలాండర్ " మ్యాన్ అఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ సెంచూరియన్ వేదికగా జరగనుంది.