విద్యార్థి దశలో ఎన్‌సీసీ చాలా అవసరం : వెంకయ్య

SMTV Desk 2018-01-07 16:20:15  vice president, venkaiah naidu, ncc cadets,

న్యూఢిల్లీ, జనవరి 7 : విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ ఎన్‌సీసీలో చేరాలని, దాని వల్ల జాతీయ దృక్కోణం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవం శిబిరం-2018ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "యువతలో నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించేందుకు ఎన్‌సీసీ చాలా అవసర౦. కళాశాల రోజుల్లో నేను కూడా ఎన్‌సీసీ యూనిఫామ్‌ ధరించాలని ఉవ్విళ్లూరే వాడిని. ఇప్పుడిలా గౌరవ వందనం చూస్తుంటే అదే భావన కలుగుతోంది" అన్నారు.