పాకిస్తానీ క్రికెటర్ వీరబాధుడు....సంచలన రికార్డు

SMTV Desk 2017-05-29 11:01:44  bilala,pakisthan crickter,fast tripple century

పాకిస్తాన్ , 28 : పాకిస్థానీ క్రికెటర్ బిలాల్ ఇర్షాద్ 26 ఏళ్ళకే సరికొత్త రికార్డు సృష్టించాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో 175 బంతులు ఎదుర్కొని 320 పరుగులతో నాటౌట్ గా నిలిచి అందరి మన్ననలు అందుకున్నాడు. పిసిబి ఫజల్ మహమూద్ ఇంటర్ క్లబ్ క్రికెట్ చాంఫియన్ షిప్ లో సరికొత్త రికార్డును నమోదు చేశారు. షాహిద్ అలామ్ బక్స్ క్రికెట్ క్లబ్ కు నేతృత్వం వహించే బిలాల్, మ్యాచ్ ప్రారంభంలో ఓపెనర్ గా రంగంలోకి దిగిన ఆయన 175 బంతుల్లో 320 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. భయంకరమైన ఇన్నింగ్ ఆడిన ఆయన 9 సిక్స్ లు, 42 ఫోర్లతో చెలరేగిపోయాడు. తన సహచర బ్యాట్స్ మెన్ జాకీర్ హుస్సెన్ తో కలిసి రెండో వికెట్ కు అత్యధికంగా 364 పరుగులు జోడించారు. ఆ జట్టు 50 ఓవర్లలో 556 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ఆడలేక కళ్ళు తేలేసింది. 411 పరుగుల తేడాతో విజయం పాకిస్తాన్ వశమయ్యింది. ఇటీవల ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ టీ 20లో 300 పరుగులతో నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే.