మీ "పాన్" రద్దు అయిందేమో..! సరి చూసుకోండి..

SMTV Desk 2018-01-07 10:49:52  pan card, income tax department,

న్యూఢిల్లీ, జనవరి 7 : రద్దు చేసిన పాన్ కార్డుల జాబితాలో మీ కార్డు ఉందేమో ఒకసారి సరి చూసుకోండి. ఎందుకంటే.. ఆదాయపు పన్ను శాఖ గతేడాది 10లక్షలకు పైగా పాన్‌ కార్డులలో కొన్నింటిని రద్దు చేసింది. నకిలీ పాన్‌ కార్డులను ఏరి పారేయడానికి ఆ కార్డులను ఆధార్‌తో జత చేయాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ పాన్‌లను గుర్తించే ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్లే నిర్వహిస్తాయి కావున కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరిగి పాన్‌ రద్దు అయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు చేయవలసిందల్లా.. https:///incometaxindiaefiling.gov.in అనే వెబ్‌సైటును ఓపెన్ చేసి అందులో Know Your PAN అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో అవసరమైన వివరాలు ఇచ్చి, మొబైల్‌ నెంబరును పేర్కొంటే.. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చిన తర్వాత.. అన్ని వివరాలూ సరిగ్గా ఉంటే. పాన్‌ "ఆక్టివ్‌" గా ఉందా? లేదా? అనే సమాచారం వస్తుంది. ఆక్టివ్‌గా ఉంటే ఇబ్బందేమీ లేదు. ఒకవేళ బ్లాక్‌ అయినా లేదంటే డీఆక్టివేట్‌ అయ్యిందని సమాచారం వస్తే ఏం చేయాలి..? * మీ పాన్‌ ఆక్టివేట్‌ చేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అసెసింగ్‌ ఆఫీసర్‌ (ఏఓ)కు లేఖ రాయాలి. అందుకోసం ఇండెమ్నిటీ బాండ్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న పాన్‌ కార్డు జిరాక్స్ కాపీని, ఆదాయపు పన్ను రిటర్నుల జిరాక్స్ ను దీనికి జత చేయాలి. అన్ని కరెక్ట్ గానే ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరస్తే.. 10-15 రోజుల్లో పాన్ కార్డ్ తిరిగి చెల్లుబాటులోకి వస్తుంది.