ఏబీడీ, డుప్లెసిస్ ఔట్.. సఫారీ స్కోర్ 164/5

SMTV Desk 2018-01-05 17:47:44  india, south africa, 1st test, duplesis, devilliers

కేప్ టౌన్, జనవరి 5 : భారత యువ బౌలర్‌ బుమ్రా అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్ మ‌న్ ఏబీ డివిలియర్స్‌ వికెట్‌ దక్కించుకున్నాడు. న్యూలాండ్స్ మైదానంలో భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డివిలియర్స్(65), డుప్లెసిస్(62) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్ స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్(3 వికెట్లు) తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ప్రోటీస్ జట్టుని ‘మిస్టర్ 360’ (65), కెప్టెన్ డుప్లెసిస్(62) పరుగులతో భారత్ బౌలర్లు ధీటుగా ఎదుర్కుంటున్నారు. అయితే కుదురుగా ఆడుతున్న ఈ జోడిని అరంగేట్ర౦ హీరో బుమ్రా చక్కటి బంతితో డివిలియర్స్ ను బౌల్డ్ చేయగా, అల్ రౌండర్ పాండ్య కెప్టెన్ డుప్లెసిస్ ను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో క్విన్టన్ డీ కాక్(25), వెర్నాన్ ఫిలాండర్(0) ఉన్నారు.