రజినీ పొలిటికల్ ఎంట్రీపై వర్మ వ్యాఖ్యలు..

SMTV Desk 2017-12-31 18:28:21  varma comments, rajinikanth political entry, chennai.

హైదరాబాద్, డిసెంబర్ 31 : సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. స్పందించారు. "ఈ శతాబ్దంలో రజినీ రాజకీయాల్లోకి రావడం అత్యున్నత సంఘటన. పార్టీని స్థాపించనున్నానంటూ ఆయన తన నిర్ణయాన్ని చెప్పే సమయంలో తెరపై కన్నా ఆయన వందరెట్లు ప్రభావితంగా కనిపించారు. తమిళనాడులోని 234 స్థానాల నుంచి పోటీ చేస్తానని రజనీ చెప్పిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని.. పవన్‌కల్యాణ్‌ ఆదర్శంగా తీసుకోవాలి" అంటూ వెల్లడించారు.