భారత్ లక్ష్యం 339...

SMTV Desk 2017-06-18 19:22:11  bhaarath, pakistan champions trophy 2017

లండన్, జూన్ 18 : ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో భారత్ - పాకిస్తాన్ తో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ టాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆరంభం నుంచి నిధానంగా ఆడుతుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ అజహరు (79 బంతుల్లో 59 ) పరుగులు చేసి అవుటయ్యాడు. ఫఖార్ జమాన్ ( 106 బంతుల్లో 114 ) సెంచరి తో రాణించాడు. బదర్ ఆజం ( 52 బంతుల్లో46 ) మహమ్మద్ అఫీజ్ ( 37 బంతుల్లో 57 ) పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ స్కోర్ 50 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫాంలో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ డక్ అవుట్ కాగా, అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లి 9 బంతులకు 5 పరుగులు చేసి వెనుదిరిగారు.