వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త...

SMTV Desk 2017-12-28 18:38:11  gas subsidy, central govt, oil corporation

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : ఇక మీదట వంట గ్యాస్ ధరలను నెల నెల పెంచబోమంటూ కేంద్రం స్పష్టం చేసింది. వంటగ్యాస్‌పై ఇచ్చే రాయితీని పూర్తిగా తొలగించేందుకు నెలవారిగా ధరలను పెంచాలని కేంద్రం భావించి, గతేడాది జూన్‌ నుంచి ప్రతి నెలా రూ. 2 చొప్పున పెంచుతూ వచ్చారు. అయితే ఇటీవల ఆ పెంపును రెట్టింపు చేస్తూ.. నెల నెలా రూ. 4 చొప్పున సిలిండర్‌ ధరను పెంచారు. కాని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తున్నందువల్ల కేంద్రం ధరలను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థలు అక్టోబరు నుంచి సిలిండర్‌ ధరలను పెంచడం లేదు.