ప్రమాణస్వీకారంలో తప్పును సరిదిద్దుకున్న మంత్రి

SMTV Desk 2017-12-28 16:37:38  Tasasudu Mufti Nomination small mistake in rajbhavan kashmir

శ్రీనగర్‌, డిసెంబర్ 28 : నేడు కేబినెట్‌ మంత్రిగా రాజ్‌భవన్ లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్‌ ముఫ్తీ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఓ పొరపాటు జరిగింది. ఇంతకీ అతను చేసిన తప్పు ఏంటంటే... ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు "ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్" అనాల్సిందిపోయి "ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ డాగ్" అనేశారట. ఆ తర్వాత వెంటనే తప్పును సరిచేసుకున్నా, ఈ తడబాటు వీడియోలో రికార్డ్‌ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. సినీమాటోగ్రాఫర్‌గా పనిచేసిన తస్సాదుక్‌ కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌ వోహ్రా నిర్ణయంతో గత వారం ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి మహమ్మద్‌ సయీద్‌ నాలుగో సంతానమైన తస్సాదుక్‌కి పర్యాటక శాఖ కేటాయించే అవకాశం ఉంది. కాగా, మంత్రి ఫరూక్‌ అంద్రాబి రాజీనామా చేయడంతో ముఫ్తీ తన కేబినెట్‌ లోకి ప్రవేశించారు.