ముంబై, డిసెంబర్ 27 : రోహిత్ శర్మ...ప్రస్తుత భారత్ క్రికెట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు..ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ను అందరూ ‘హిట్ మ్యాన్’ గా వర్ణిస్తారు. అయితే ఈ పేరు ఎలా వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడే చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై రోహిత్ మాట్లాడుతూ..”ప్రస్తుత భారత్ క్రికెట్ కోచ్ రవిశాస్త్రి నన్ను తొలుత ‘హిట్‌మ్యాన్’ అని పిలిచాడు. ఓ సారి ఏదో మ్యాచ్‌లో నేను బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాను. దాంతో మా జట్టు సభ్యులు నన్ను ఉద్దేశించి నువ్వు ‘హిట్‌మ్యాన్’లా ఆడావు అని సరదాగా అన్నారు. ఈ సంభాషణ అంతా అప్పుడు పక్కనే ఉన్న రవిశాస్త్రి విన్నారు. దీంతో అతడు మ్యాచ్ మధ్యలో కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించే సమయంలో నన్ను రోహిట్‌గా సంబోధించడం మొదలుపెట్టారు. అలా నా పేరు రోహిత్ కాస్త రో‘హిట్’ గా మారింది ” అని చెప్పుకొచ్చాడు.