"కమ్‌ ఔట్‌ అండ్‌ ప్లే" : కోహ్లీ

SMTV Desk 2017-12-25 16:04:05  kohli, tweet, under-19 world cup, india

న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ అండర్ -19 క్రికెటర్లకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 4 వరకు న్యూజిలాండ్‌లో జరిగే ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలకు భారత్ అండర్-19 టీం వెళ్లనుంది. ఈ సందర్భంగా కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... "ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ నా కెరీర్‌లో మరిచిపోలేని ఘట్టం. ఈ టోర్నీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడేందుకు వెళ్తున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. నా ప్రస్థానం ఇక్కడే ఆరంభించాను. ఆటలో ప్రతిక్షణం ఎంజాయ్‌ చేస్తూ మీలోని ప్రతిభను బయటపెట్టండి. భారత్‌ గర్వపడేలా చేయండి" అని పేర్కొన్న కోహ్లీ ‘కమ్‌ ఔట్‌ అండ్‌ ప్లే’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశాడు.