ముక్క, చుక్క ఉంటే...ఓటు పక్కా :భాజపా మంత్రి

SMTV Desk 2017-12-25 13:47:54  BJP Minister of State Om Prakash Rajbhar, Comments

లఖ్‌నవూ, డిసెంబర్ 25: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి భాజపా మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ... ఈ మధ్యకాలంలో మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయకుండా చికెన్‌ ముక్క, మందు చుక్క ఇచ్చేవారికే పేదలు ఓట్లేస్తున్నారని ఆయన అన్నారు. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక, మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు రాజకీయ నాయకులు వారిని పేదలుగానే చూస్తారని ఆయన ఆరోపించారు. మైనార్టీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ పేదలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.