ఆధార్ కు అడ్డుపతున్న కాంగ్రెస్

SMTV Desk 2017-12-24 16:06:24  Union Finance Minister Arun Jaitley, adhaar, congress, newdelhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : యూపీఏ హయాంలో ఆధార్ కు సంబంధించిన కార్యచరణ శూన్యమని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఎద్దేవా చేశారు. ఆధార్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి బాగోలేదని ఆయన ఆరోపించారు. ఆధార్‌ సృష్టికర్త నందన్‌ నీలేకని, భారత ప్రధాని నరేంద్రమోదీకి కలిసి ఆధార్‌ విశిష్టతపై చక్కటి ప్రజెంటేషన్‌ ఇచ్చారని తద్వారా ఆయనను ఒప్పించారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆధార్‌పై వడివడిగా అడుగులు పడ్డాయన్నారు. అదే సమయంలో ఆధార్‌ వివరాలను గోప్యంగా ఉంచడానికి అవసరమైన చట్టంపై ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించిందన్నారు.‘యూపీఏ ప్రభుత్వం విభిన్నమైన ఆలోచనా ధోరణి కలిగి ఉండడంతో, దేశ భద్రతకు సంబంధించిన అంశాలను లెవనెత్తుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఆధార్‌పై ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షంలో ఉన్న యూపీఏ ప్రతీ ఆలోచనకు అడ్డుపడుతోందని ఆయన వెల్లడించారు.