ప్రధాని మోదీకి వైద్యుల లేఖ...

SMTV Desk 2017-12-24 13:43:28  rajasthan Doctors Association President Harjeet Singh modi letter

జయపుర, డిసెంబర్ 24 : రాజస్థాన్‌లోని ప్రభుత్వ వైద్యులు తమకు జీతాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. అయితే, ఈ విషయాన్ని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హర్జీత్‌ సింగ్‌ నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలో తమ సమస్యను తెలిపారు. ఇంతకీ ఆ లేఖలో రాసిన విషయమేమిటంటే, మీలాంటి ప్రధాని మాకు ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం. ఓ ప్రభుత్వ వైద్యుడి బాధలు మీకు తెలియాలంటే తెలుపు రంగు ఆప్రాన్‌ వేసుకుని ఒకరోజు ప్రభుత్వ వైద్యుడిగా వ్యవహరించండి. అప్పుడు మీకు తమ బాధ తెలుస్తోందని, అంటూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబీకులు మాతో ఎలా ప్రవర్తిస్తారో, ప్రచారం కోసం ఇలాంటి ఆందోళనలు చేస్తున్నామని ఆరోపించే మంత్రులకు కూడా మా బాధలేంటో తెలిసొస్తాయన్నారు. మీరు ఒక్కరోజు ప్రభుత్వ వైద్యుడిగా మారితే విద్యావ్యవస్థలో మార్పు, ప్రజలకు నమ్మకం కలుగుతుందని,లేఖలో వెల్లడించారు. మేరకు డిసెంబర్‌ 16 నుంచి ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులపై ప్రభుత్వం రెస్మా చట్టం ప్రయోగించి 86 మంది వైద్యులను అరెస్టు చేయించిందని లేఖలో ఇలా జరిగిన విషయాన్ని మోదీకి వివరించారు. కాగా, ప్రధాని మోదీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన అందలేదు.