కడపలో ఉక్కు ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలి: సోమిరెడ్డి

SMTV Desk 2017-12-21 16:38:59  Steel industry, Chaudhary Birendrasingh, venkaiah naidu, somireddy

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఉపాధి కల్పించాలని, ఉక్కు పరిశ్రమ స్థాపించాలని కడప జిల్లాలో గత కొద్ది కాలం నుండి ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో ఏపీ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ... ఉక్కు ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలనీ కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరిందన్నారు. ఈ నెల 27న టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కేంద్రమంత్రులు, అధికారులు ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ టీమ్ వస్తుందని తెలిపారు. అంతేకాదు 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విహారయాత్ర నుంచి రాగానే దీనికి సంబందించిన అన్ని విషయాలు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుజనా చౌదరి, సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పాల్గొన్నారు.