ఎంపీ నివాసంలో అగ్నిప్రమాదం...

SMTV Desk 2017-12-19 14:09:00  fire accident,mp sri ramulu, bjp,

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: బాజాపా ఎంపీ బి. శ్రీరాములు నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎంపీ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్నీ ఎంపీ మీడియాకు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని, ఘటనలో తమ పిల్లలకు స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు.