"మాస్టర్ బ్లాస్టర్" రికార్డ్ దాటేసిన స్మిత్...

SMTV Desk 2017-12-17 12:09:34  asis cricket captain, steev smith, new record, sachin tendulkar, record break, asis team.

పెర్త్‌, డిసెంబర్ 17 : ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కెప్టెన్ స్టీవ్‌.. స్మిత్‌ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ 138 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో వేగంగా టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా స్మిత్‌ అవతరించడం, అది అతడి కెరీర్‌లోనే 22వ శతకం కావడం విశేషం. కాగా సచిన్‌ 22 శతకాలు సాధించేందుకు 114 ఇన్నింగ్స్‌ తీసుకోగా, స్టీవ్ స్మిత్ కేవలం 108 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి రెండు స్థానాల్లో ఆసీస్ స్టార్ బ్యాట్స్ మన్ డాన్‌ బ్రాడ్‌మన్‌ (58 ఇన్నింగ్స్‌), భారత క్రీడాకారుడు సునీల్‌ గావస్కర్‌ (101 ఇన్నింగ్స్‌) ఉన్నారు. ఇదిలా ఉండగా శతకం సాధించే క్రమంలో స్మిత్ 1000 పరుగుల మైలురాయిని కూడా సాధించాడు. దీంతో స్మిత్ పై ప్రశంసల వర్షం కురిసింది. పలువురు క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.