రాజకీయ రంగంలో నేరస్తులు ఉండకూడదనే ఇలా..?

SMTV Desk 2017-12-12 18:50:30  MP, MLA, SPECIAL COURT, CENTRAL GOVERNMENT, ELECTION COMMOTION.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12 : ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ నిమిత్తం కేంద్రం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ నిమిత్తం 12 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు సుప్రీం ధర్మాసనానికి కేంద్రం తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 1581 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో పది కేసుల్లోని నేతలు చనిపోవడంతో ఆ కేసులు కొట్టివేసినట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. కాగా రాజకీయ రంగంలో ఎలాంటి నేరస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది.