ఒక్కటైనా విరాట్- అనుష్క శర్మ

SMTV Desk 2017-12-11 21:57:09  VIRAT, ANUSHKA SHARMA, MARRIAGE, ITALY, ROAM, TUSKANI

రోమ్, డిసెంబర్ 11 : గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెళ్లి. సామాజిక మాధ్యమాల వేదికగా వీరిద్దరి పై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వీటి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇటలీలోని టస్కనీలోని ఓ రిసార్టులో విరాట్‌,అనుష్క పెళ్లి చేసుకున్నారు. అతి కొద్దిమంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ ప్రేమ జంట ఏకమయ్యారు. అయితే వీరి పెళ్లి ప్రయత్నాలు తొలి నుండి చాలా గోప్యంగా జరిగాయి. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభా నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో వీరి వివాహ వేడుక జరిగింది. ఇటలీ నుంచి వచ్చాక ఈ నెలా చివరిన విరుష్క జోడి ముంబయిలో పెళ్లి విందు ఇవ్వనుందని, జనవరి 4న ముంబయిలోని బాంద్రా కుటుంబ కోర్టులో పెళ్లి రిజిస్ట్రేషన్‌ ఉంటుందని సమాచారం. మరోవైపు విరాట్‌, అనుష్క జంటకు అంతర్జాలంలో భారీ ఎత్తున అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు.