బంగ్లాను చిత్తు చేసిన భారత్

SMTV Desk 2017-06-16 13:05:39  bangladesh, india, rohit sharma

బర్మింగ్ హోమ్, జూన్ 16 : ఛాంపియన్స్ ట్రోఫి లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ - భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్ మొదటి ఓవర్లో నే భువనేశ్వర్ బౌలింగ్ లో బంగ్లాదేశ్ వికెట్ ను తీసాడు. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తిన్న బంగ్లాదేశ్ తమీమ్ (82 బంతుల్లో 70), ముష్పికర్ ( 85 బంతుల్లో 61) పరుగులతో రాణించారు. ఆ తరువాత వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోర్ కు వెనుదిరుగడం తో బంగ్లాదేశ్ 50 ఓవర్స్ లో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ మంచి అరంభానిచ్చారు. తరువాత కొద్ది సేపటికే శిఖర్ ధావన్ (34 బంతుల్లో 46) పరుగులు చేసి అవుటయ్యారు. తరువాత రోహిత్ తో జతకట్టిన కోహ్లి ఇద్దరు కలిసి భారత్ స్కోర్ ను వేగం పెంచారు. ఈ దశలో రోహిత్ (129 బంతుల్లో 123 నాటౌట్) పరుగులతో శతకం పూర్తి చేశాడు. మరో దశలో కోహ్లి కూడా (78 బంతుల్లో 96 నాటౌట్) పరుగుల తో రాణించి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. బంగ్లేదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించి ఫైనల్ కు దుసుకేల్లింది. ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ నెల 18 న ఆదివారం రోజు జరిగే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరగనుంది.