కండోమ్‌ యాడ్‌ లు రాత్రిళ్లు మాత్రమే..!

SMTV Desk 2017-12-09 11:46:26  Condom advertisement, Advertising Standards Council of India, timings, complaint to central government,

న్యూఢిల్లీ, డిసెంబర్ 09 : టీవీలలో వచ్చే కండోమ్‌ యాడ్‌ ల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూడలేకపోతున్నామంటూ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొన్నామధ్య శృంగార తార సన్నీలియోన్‌ నటించిన ఓ కండోమ్‌ యాడ్‌ పెద్ద సంచలనమే రేపింది. ఇటువంటి యాడ్స్ వేయోద్దంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో.. కండోమ్‌ యాడ్ లను ఇక నుండి రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రసారానికి అనుమతించాల౦టూ అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్సీఐ) కేంద్రాన్ని కోరింది. ఈ విషయంపై కేంద్రం స్పందించాల్సి ఉంది.