కులాంతర వివాహానికి కేంద్రం ఆర్ధిక సాయం..

SMTV Desk 2017-12-07 09:54:49  inter cast marriage, central government, price money, 2.5 lakhs.

న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారికి రూ.2.5 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కులాంతర వివాహం చేసుకునే వధువు, వరుడిలో ఎవరో ఒకరు దళితులై ఉండాలన్నది నిబంధన. కాగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని రెండు విడతలుగా అందజేయనుంది. అలాగే ఇంతకు ముందు రూ. 5 లక్షలకు మించని వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ ప్రోత్సాహకం లభించనుందని సమాచారం.