బంగ్లాదేశ్ కు అరంభంలోనే ఎదురుదెబ్బ

SMTV Desk 2017-06-15 15:38:04  india, bangladesh

ఇంగ్లాండ్, జూన్ 15 : ఛాంపియన్స్ ట్రోపి లో భాగంగా ఈ రోజు ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని అభిమానులు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఇందులో ఓడిన వాళ్ళు ఇంటి ముఖం పడుతారు. గెలిచిన వాళ్ళు ఫైనల్ కు చేరుకొని పాకిస్తాన్ తో తలబడుతారు. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంమీండియా అరంభంలోనే బంగ్లాదేశ్ ను దెబ్బ తీసింది. మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సౌమ్య సర్కార్ ను (0) డక్ అవుట్ చేశాడు. ఆరంభంలోనే ఓపెనర్ వికెట్ కోల్పోవడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు నిరుత్సాహపడ్డారు.