సొంత గడ్డ పై ఓడించిన పాక్

SMTV Desk 2017-06-15 14:42:28  pakistan, england

ఇంగ్లాండ్, జూన్ 15 : ఇంగ్లాండ్ లో జరుగుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నిలో జరిగిన అన్ని మ్యాచ్ లో విజయం సాధించి ఇంగ్లాండ్ ముందుగా సెమిస్ చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. సొంతగడ్డ.. వరుస విజయాలు.. వూపు మీదున్న ఆటగాళ్లు.. అడుగడుగునా ప్రోత్సహించే అభిమానులు.. ఇవేమీ ఇంగ్లాండ్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేర్చలేకపోయాయి! మరో ఐసీసీ వన్డే టోర్నీలో ఆ జట్టు రిక్తహస్తాలతో వెనుదిరిగింది. లంకపై గెలిచి ఉత్సాహంతో ఉన్న పాక్‌.. అలవోకగా ఇంగ్లాండ్ ను సొంత గడ్డపైనే ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌, పాకిస్తాన్ బౌలర్ల దాటికి ఏ దశలో కుదురు కోలేదు. 49.5 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసారు. రూట్ 46 బెయిర్ స్టో 43 పరుగులతో రాణించారు. 211 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలోనే హాజహర్, జమాన్ ఇద్దరు నిమ్మదిగా ఆడుకుంటూ 17 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెల కోల్పారు. ఇద్దరు హాజహర్ 76 జమాన్ 57 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ విజయ లక్ష్యం సులువైంది. కేవలం 37. 1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేసి ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.