వ్యతిరేకించేవారు ఎద్దుల బండిలో వెళ్లడం మంచిది : మోదీ

SMTV Desk 2017-12-04 14:25:25  president modhi, comments on congress party, bullet train, gujarath elections.

న్యూఢిల్లీ, డిసెంబర్ 04 : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ లో చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ను వ్యతిరేకించడంపై మోదీ పై విధంగా స్పందించారు. బుల్లెట్ ట్రైన్ ను వ్యతిరేకించే వారు ఎద్దుల బండిలో ప్రయాణించడం మేలు. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును తీసుకురావాలనుకుంది. కాని వారు చేయలేకపోయిన పనిని తాము చేస్తుంటే వారికి కడుపు మంటగా ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా భారత్ తో పాటు జపాన్ సైతం రూ.1.1లక్షల కోట్లతో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.