చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ విజేతగా హైదరాబాద్ అమ్మాయి...

SMTV Desk 2017-12-04 12:30:02  Tata Open India International Challenge Badminton Tournament, gadde ruthivika shivanai, hyderabad

ముంబాయి, డిసెంబర్ 4: మరోసారి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలించింది హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని. ఆదివారం జరిగిన టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఎనిమిదో సీడ్‌ రుత్విక, రియా ముఖర్జీ తల పడ్డారు. రుత్విక 21–12, 23–21తో గెలిచింది. 20 ఏళ్ల తరువాత రెండో గేమ్‌లో ఒకదశలో 17–20తో మూడు గేమ్‌ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచిన రుత్విక 20–20తో స్కోరును సమం చేసింది. అనంతరం ఇద్దరూ చెరో పాయింట్‌ గెలవడంతో స్కోరు 21–21తో సమమైంది. ఈ దశలో రుత్విక వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాటా ఓపెన్‌ను రుత్విక నెగ్గడం ఇది రెండోసారి.