కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్...

SMTV Desk 2017-12-04 11:45:40  Congress President post, Rahul Gandhi nomination, sonia gandhi, manmohan singh.

న్యూఢిల్లీ, డిసెంబర్ 04 : కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రాహుల్ కి పోటీగా ఇప్పటివరకు ఒక్కరు కూడా పోటీ చేయకపోవడం విశేషం. కాగా రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ఈ నెల 17 న, కౌంటింగ్ 19 వ తేదీన జరగనుంది. రాహుల్ నామినేషన్ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాగా ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రామచంద్రం తెలిపారు.