ఎయిరిండియా ఉద్యోగినిపై చేయి చేసుకున్న మహిళ..

SMTV Desk 2017-11-28 16:06:01  Indira Gandhi International Airport, Newdelhi,

న్యూఢిల్లీ, నవంబర్ 28 : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. ఎయిరిండియా ఉద్యోగినితో గొడవపడడమే కాకుండా ఆ మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకుంది. విమానాశ్రయాల్లో నిబంధనలు ఉల్లంఘి౦చిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర విమాన‌యాన శాఖ ఇదివరకే హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యాణికులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ.. నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో టిక్కెట్ల జారీ విషయంలో చిన్న గొడవ జరిగి ఎయిరిండియా మహిళా ఉద్యోగినిని మరో మహిళ కొట్టింది. కాగా ఈ విషయంపై అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఆ మహిళ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ వెళ్ల‌డానికి ఎయిర్‌పోర్టుకి వచ్చినట్లు తెలుస్తోంది.