గుట్కా తిని పెళ్లి చెడగొట్టుకున్నపెళ్లి కొడుకు

SMTV Desk 2017-06-13 17:32:09  Uttar Pradesh,Baldiya district,Bride,Bride groom

లక్నో, జూన్ 13: పెళ్లికొడుకు గుట్కా నమలడం చూసి పెళ్లి రద్దు చేసుకుంది ఓ వధువు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకెళితే.. మురార్‌పట్టి గ్రామానికి చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. మరి కొద్దిసేపట్లో వధూవరులు వివాహ బంధంతో ఏకమవుతారనగా, పెళ్లికొడుకు గుట్కా నములుతూ మండపానికి రావడం పెళ్లికూతురు గమనించింది. దీనితో ఒక్కసారిగా పెళ్లిపీటల నుంచి లేచి ఈ పెళ్లి చేసుకోనని చెప్పేసింది. దాంతో వరుడితో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. మరోసారి ఈ విధంగా చేయనని పెళ్లికొడుకు ఎంత చెప్పినా అమ్మాయి ఈ వివాహానికి అంగీకరించలేదు. దాంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా యువతికే మద్దతుగా నిలవడంతో, ఏమి చేయాలో తెలియక వరుడి కుటుంబీకులు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు.