అంతర్‌రాష్ట్ర మండలి స్థాయి సదస్సులో ఏపీ మంత్రి యనమల

SMTV Desk 2017-11-25 17:44:11  Vigyan Bhavan, Union Home Minister Rajnath Singh, Inter State Council Standing Committee ConferenceInter State Council Standing Committee Conference, AP minister yanamala

న్యూఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నేడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన అంతర్‌రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పూంచ్‌ కమిటీ సిఫారసులపై పూర్తిస్థాయిలో చర్చించి, పలు సూచనలు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడుతూ... ‘‘కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రాయల్టీలు పెంచడం లేదని, మూడేళ్లకోసారి రాయల్టీ ఇవ్వాలన్న పూంచ్‌ కమిటీ సిఫార్సును ఏపీ సమర్థిస్తోంది. ఖనిజాలపై రాయల్టీ పంపకాన్ని మూడేళ్లకోసారి పెంచేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆఫ్‌ షోర్‌కు సంబంధించిన కార్యకలాపాలపై కూడా రాయల్టీ కోరినట్లు, సహజ వనరులు, స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా వచ్చిన సంచిత నిధిని రాష్ట్రాలకు పంచాలని పలువురు సీఎంలు కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో, మల్టీ ఇయర్‌ బడ్జెట్‌పై సానుకూల నిర్ణయం తీసుకున్నామని, యనమల వివరించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీతో పాటు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఒడిశా, రాజస్థాన్‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.