భజ్జీకి క్షమాపణ చెప్పిన దాదా

SMTV Desk 2017-11-22 11:32:29  GANGULY, HARBHAJAN SINGH, TWITT, INDIA CRICKET TEAM

హైదరాబాద్, నవంబర్ 22 : భారత్ జట్టు మాజీ సారధి గంగూలీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు సారీ చెప్పారు. గంగూలీ నాయకత్వంలో, ఆటగాడిగా భజ్జీ తన బౌలింగ్ తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే భజ్జీ కి దాదా క్షమాపణ ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా..? తాజాగా హర్భజన్ తన సతీమణి గీతా బస్రా, కుమార్తె హినయ హీర్‌ ప్లహాతో అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం ముందు దిగిన చిత్రాన్ని హర్భజన్‌ ఆదివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ట్విట్ కు స్పందించిన గంగూలీ ‘బేటా బహూత్‌ సుందర్‌ హై భజ్జీ.. బహూత్‌ ప్యార్‌ దేనా’ అని ట్వీట్‌ చేశాడు. పొరపాటున కుమార్తెను కొడుకుగా అనుకొని బేటా అన్న పదం వాడాడు. వెంటనే తన తప్పు గమనించి ‘హర్భజన్‌ సింగ్‌ క్షమించు. బేటీ చాలా బాగుంది. ముసలోడిని అయిపోతున్నా!’ అని మళ్లీ ట్వీట్‌ చేశాడు. దీనికి బదులుగా హర్భజన్ ‘నా బిడ్డ పట్ల ప్రేమకు, ఆశీర్వాదానికీ ధన్యవాదాలు దాదా. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా’ అని భజ్జీ బదులిచ్చాడు. ఇప్పుడు ఇది అంతర్జాలంలో వైరల్ గా మారింది.