నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్ -19

SMTV Desk 2017-06-11 19:01:21  Gitaat-19 into the prescribed orbit, GSL We Mark 3d1 Rocket, 36 kilometers of land,1,742 kilograms of lam engine,On the eve of 8th of this month, 116 hours a day at 2.03 hours

శ్రీహరికోట (సూళ్లూరుపేట ), జూన్ 11 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్ వీ మార్క్ 3 డీ 1 రాకెట్ ద్వారా అంత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీశాట్-19 ఉపగ్రహాన్ని నాలుగు విడతలుగా కక్ష్య దురాన్ని పెంచుకుంటూ శనివారం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహం లామ్ ఇంజిన్ లోని 1,742 కిలోల ఇంధనాన్ని రెండు విడతలుగా వినియోగించి కక్ష్య దురాన్ని పెంచారు.ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున 2.03 గంటలకు 116 సెకన్ల పాటు ఒకసారి, మళ్లీ అదేరోజు తిరిగి సాయంత్రం 3.44 గంటలకు 5,538 సెకెన్ల పాటు లామ్ ఇంజిన్లను రెండోసారి మండించి కక్ష్య దురాన్ని విజయవంతంగా పెంచారు. ఈ నెల 5వ తేదిన సాయంత్రం 5.28 గంటలకు షార్ నుంచి జీఎస్ఎల్ వీ మార్క్ 3 డీ 1 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపిన జీశాట్-19 ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హసన్ లోని నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్య ప్రవేశ పేట్టే ప్రక్రియను చేపట్టింది. శనివారం ఉదయం 7.59 గంటలకు నాలుగోసారి అంటే ఆఖరి విడతగా 488 సెకెన్ల పాటు ల్యామ్ ఇంజిన్లు మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్టిర కక్ష్య ఇస్రో శాస్రవేత్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్ ప్యానెల్స్ విచ్చుకుని చక్కగా పనిచేస్తుందని శాస్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సుమారు పదేళ్ల పాటు సేవలను అందిస్తుందన్నారు.