అసెంబ్లీ వద్దు.. డాన్స్ ముద్దు...

SMTV Desk 2017-11-15 17:50:31  Cong. MLA Ambareesh, Karnataka Assembly Meetings, MLA Ambresh, dance event hot topic viral video.

కర్నాటక, నవంబర్ 15 : కర్నాటక అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై సువర్ణ సౌధలో ఎమ్మెల్యేలంతా వాదప్రతి వాదనలతో వేడి పుట్టిస్తున్నారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబరీష్ అమ్మాయిలతో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తన వాదనలు వినిపించాల్సిన ఎమ్మెల్యే.. వాటిని ఎగ్గోటి స్టెప్పులేసి విమర్శల పాలయ్యారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ఓ నేత అసెంబ్లీ సమావేశాలకు ఎగనామ౦ పెట్టి మ్యూజిక్ ఈవెంట్లలో పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆయన డ్యాన్సు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలను పక్కన పెట్టి ఇలా చేయడమేంటని జనం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.