జీఎస్టీ సవరణ గూర్చి ఈటల

SMTV Desk 2017-06-11 14:07:18  Finance Minister Rajendra, AP Finance Minister Yanamala ,16th GST summit in Delhi

న్యూఢిల్లీ, జూన్ 11 : ఢిల్లీ లో 16వ జీఎస్టీ సమావేశానికి హాజరైన ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ , ఏపీ ఆర్థిక మంత్రి యనమల, అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు తగ్గించేలా జీఎస్టీ రూపొందించాలన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చిన్నా, మధ్యతరహా వ్యాపారులపై పన్ను ప్రభావం పడితే మేకిన్ ఇండియాకు భంగం కలిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన 16వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల హాజరయ్యారు. మూడేళ్ల కాలంలో అనేక చర్చోపచర్చలు జరిపి.. ఒక అంగీకారానికి వచ్చామని అన్నారు. కలెక్షన్ కావాలంటే, ఆదాయం పెరగాలంటే.. ఎగవేతకు ఆస్కారం లేని పద్ధతిలో జీఎస్టీ అమలు చేస్తే మంచిదని, దీనిపై కొంత లోతైన చర్చ జరిగితే బాగుంటుందని ఈటల అభిప్రాయపడ్డారు.