చైనా ఓపెన్ కు తెలుగు తేజం దూరం..

SMTV Desk 2017-11-11 14:55:29  kidambi srikanth, china open series, indian shuttler, new delhi

న్యూఢిల్లీ, నవంబర్ 11 : భారత్ టాప్ షట్లర్‌, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ సిరీస్ దూరమయ్యాడు. ఇటీవల జరిగిన జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌ చేతిలో ఓడిన శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ టోర్నీ ఫైనల్లో శ్రీకాంత్‌ కాలుకు గాయమైంది. గాయాన్ని పరీక్షించిన వైద్యులు అతనికి కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని సలహా సూచించారు. ఈ ఏడాది మంచి ఫాంను కొనసాగించిన శ్రీకాంత్‌ నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచి, ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు.