స్కూల్ కి సెలవు కోసమే.. హత్య..

SMTV Desk 2017-11-09 13:10:24  Ryan International School, murder, cbi officers,

న్యూఢిల్లీ, నవంబర్ 9 : గత రెండు నెలల క్రితం రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రధ్యుమన్ హత్యకు గురైన విషయం తెలిసి౦దే. ప్రధ్యుమన్ ను స్కూల్ బస్సు డ్రైవర్ హత్య చేశాడంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి ప్రధ్యుమన్ ను చంపేశాడని అధికారులు వెల్లడించారు. పేరెంట్స్ మీటింగ్-పరీక్షలకు బయపడి, స్కూల్ కు ఎదో రకంగా సెలవు రావాలని ఆ విద్యార్ధి భావించి ఈ హత్యకు పాల్పడ్డాడని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. రేయాన్ యాజమాన్యం హస్తం కూడా ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని, వారిని ప్రశ్నించాలని, సీబీఐ వర్గాలకు ప్రధ్యుమన్ తల్లిదండ్రులు కోరారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.