ఫ్రెంచ్ కిరీటం ఎవరికి!!

SMTV Desk 2017-06-10 14:50:17  freanch open, singils, zelwna, halefe, final match

పారిస్, జూన్ 10 : ఫ్రెంచ్ కిరీటం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి టెన్నీస్ క్రిడాభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ పోటిలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లాత్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకో, రొమేనియాకు చెందిన హాలెఫ్ ల మధ్య మహిళల సింగిల్స్ ఫైనల్ పోటి జరుగనుంది. జెలెనా ఓస్టాపెంకో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చెరిన తొలి లాత్వియా క్రిడాకారిణి కావడం విశేషం. అదే విధంగా అన్ సిడెడ్ గా టెన్నిస్ ఫైనల్ లోకి దూసుకొచ్చింది. ఇక రొమేనియాకు చెందిన హా లెఫ్ గత 2015 లో ఫైనల్ చేరినా షరపోవా చేతిలో ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారైనా విజేతగా నిలువాలనే పట్టుదల ఆమెలో కనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ గా రికార్డు సృష్టించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ క్రీడాభిమానులు కిరీటం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.