బోపన్నకు అర్జున పురస్కారం!!

SMTV Desk 2017-06-10 13:37:37  arjuna award, tennis star bopanna, aita, rashimi chekravarthy

న్యూఢిల్లీ, జూన్ 10 : భారత టెన్నిస్ స్టార్ బోపన్న పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు. రోహన్ బోపన్నతో పాటు రష్మీ చక్రవర్తి కూడా అర్జున పురస్కారానికి సిఫార్సు అయిన జాబితాలో ఉన్నారు. ఈ మేరకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు జాబితాను పంపుతున్నట్లు ఆ సంఘం కార్యదర్శి హిరన్మయ్ చటర్జీ వెల్లడించారు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో రోహన్ బోపన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన కెనడా క్రీడాకారిణి గాబ్రియెలా డాబ్రోవిస్కీ తో జంటగా మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు. గతంలోనూ ఎన్నోసార్లు అతని పేరును నామినేట్ చేసినప్పటికి అర్జున పురస్కారం దక్కలేదని ..ప్రస్తుతం ఈ అవార్డుకు ఆయన అర్హుడని వివరించింది.