హస్తం వైపు రాములమ్మ..!

SMTV Desk 2017-11-07 18:22:47  heroine vijayashanthi, congress party, rahul gandhi,

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రముఖ సీనీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇటీవల క్రియాశీలక రాజకీయాల్లో విజయశాంతి యాక్టివ్ కానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ ప్రకటించిన విషయం విదితమే. కాగా ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.