మోదీ రెండు అతి పెద్ద తప్పులను... మాజీ ప్రధాని

SMTV Desk 2017-11-07 11:35:24  Former Prime Minister Manmohan Singh, congress elections, gujarath tour, modi, GST

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా తన వైఖరిని మర్చుకోవాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం మన్మోహన్ సింగ్ గుజరాత్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ అమలు చేసిన జీఎస్టీ, నోట్లరద్దు గురించి ప్రస్తావించారు...మోదీ రెండు అతి పెద్ద తప్పులను చేయడంతో భారత వ్యవస్థకు విపత్తులను తెచ్చి పెట్టయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయని, దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వుంటుందని మన్మోహన్ హెచ్చరించారు. కాగా, మన్మోహన్ సింగ్, తన పర్యటనలో భాగంగా గుజరాత్ వ్యాపారులను ప్రత్యేకంగా కలుసుకుని, వారి వ్యాపారాలపై జీఎస్టీ చూపిన ప్రభావాన్ని గురించి అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన తెలిపారు.