చైనాతో తలపడనున్న భారత్..

SMTV Desk 2017-11-05 11:44:32  asia cup womens hockey, final with china, captain rani, japan

కకామిగహర, నవంబర్ 05 : భారత్ మహిళా హాకీ జట్టు ఆసియా కప్ కు ఆడుగు దూరంలో నిలిచింది. ఈ రోజు జరిగే ఫైనల్లో చైనాతో తలపడనున్న భారత్ ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరిన టీమిండియా 2004లో టైటిల్‌ నెగ్గి, మిగతా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల హాకీ జట్టు స్పూర్తిగా ఇందులో విజయం కోసం పోరాడతామని టీమిండియా కెప్టెన్ రాణి వివరించారు. అయితే గ్రూప్ దశలో చైనాను మట్టికరిపించిన భారత్ ఫైనల్లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.