నేడే అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ తుది సమరం..

SMTV Desk 2017-10-28 14:43:39  Under 17 Football World Cup, today final match, sports updates.

కోల్‌కతా, అక్టోబర్ 28 : భారత్ లో క్రీడల పరంగా చూస్తే క్రికెట్ కు ఉన్నంత ఆదరణ ఇంకా ఏ క్రీడకి లేదనడంలో సందేహం లేదు. కానీ భారత్ మొదటిసారిగా అతిధ్యమిస్తున్న అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక వీక్షకులు ప్రత్యక్షంగా వీక్షించిన టోర్నీగా రికార్డు నెలకొల్పనుంది. ఈ రోజు కోల్‌కతా లోని హోల్కర్ స్టేడియంలో ఇంగ్లండ్, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ హోరా హోరిగా సాగనుంది. టోర్నీ వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బ్రిటిష్ జట్టు ఇంతవరకు ప్రపంచ కప్ ను గెలవలేకపోయింది. 3సార్లు ఫైనల్ కి చేరినప్పటికీ స్పెయిన్ జట్టుది కూడా అదే పరిస్థితి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా రికార్డే.. ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో 1985 లో అత్యధిక స్థాయిలో 12,30,976 మంది ప్రేక్షకులు విచ్చేశారు. ప్రస్తుతం భారత్ లో ఈ టోర్నీని 12,24,027 మంది వీక్షించారు. ఇంకో 6,950 మంది చూస్తే అత్యధిక మంది అభిమానులు ప్రత్యక్షంగా చూసిన ప్రపంచకప్‌గా 2017 టోర్నీ రికార్డుల్లోకెక్కబోతున్నట్లే.