చైనా అధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు...

SMTV Desk 2017-10-26 18:20:39  Indian Prime Minister Narendra Modi, china President Shi Jinping whishes

న్యూఢిల్లీ, అక్టోబర్ 26 : భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోని కమ్యూనిస్ట్‌ పార్టీకి మరోమారు ఎన్నికైన జనరల్‌ సెక్రటరీ ఆ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ కూడా జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిన్‌పింగ్‌తో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌లో చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌ జిన్‌పింగ్‌కు చెప్పారని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఈ మేరకు చైనా సోషల్‌మీడియా నెట్‌వర్క్‌ అయిన వైబో ఖాతాలో మోదీ మెసేజ్‌ పోస్టు చేశారు. ‘సీపీసీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు. భారత్‌-చైనా మధ్య బంధం మరింత బలపడాలని మోదీ పోస్టు చేశారు. కాగా.. ఇంగ్లిష్‌, చైనీస్‌ మాండరీన్‌ భాషల్లో మోదీ ఈ మెసేజ్‌ని పోస్ట్ చేయడం విశేషం.